తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పెరూలో వరద బీభత్సం, 10మంది మృతి - 10మంది మృతి

పెరూలోని దక్షిణ ఆండీస్​లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా 10మంది మృతి చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు మార్టిన్ విజ్కారా వెల్లడించారు.

పెరూలో వరద బీభత్సం, 10మంది మృతి

By

Published : Feb 12, 2019, 7:00 AM IST

పెరూలో వరద బీభత్సం, 10మంది మృతి
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు మార్టిన్​ వెల్లడించారు. దక్షిణ ఆండీస్​ ప్రాంతంలో కురుస్తోన్న ఈ భారీ వర్షాల కారణంగా మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. ఇళ్లు, రహదారులు, వంతెనలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

మాంటేక్వా, టాక్నా ప్రాంతాల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలతో వచ్చిన బురద పట్టణమంతా నిండిపోగా తాత్కాలిక టెంట్లు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు స్థానికులు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. పెరూ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details