8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన 'ఏఎన్-32' విమానం జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో గల్లంతైన నాటి నుంచి ఐదు రోజులుగా గాలింపు చేపట్టినా ఎలాంటి ఫలితం లేదని అధికారులు తెలిపారు.
5 రోజులైనా దొరకని 'ఏఎన్-32' ఆచూకీ - ఏఎన్-32
ఐదు రోజుల క్రితం గల్లంతైన ఏఎన్-32 విమానం జాడ ఇంకా తెలియలేదు. సోమవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రతికూల వాతావరణం రాత్రివేళలో గాలింపునకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు తెలిపారు.
ఐదు రోజులైనా దొరకని 'ఏఎన్-32' ఆచూకీ
భారత నావికా దళానికి చెందిన పీ-8ఐ, సైన్యానికి చెందిన సీ130జే అధునాతన హెలికాఫ్టర్లతో శనివారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'ఏఎన్-32' జాడకోసం విరామం లేని గాలింపు
Last Updated : Jun 8, 2019, 8:40 AM IST