చేప ప్రసాదం పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం... రాత్రి మొత్తం కొనసాగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. బత్తిని సోదరుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.ఇప్పటికే సుమారు 60 వేల మందికి పైగా చేప మందు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు.
నిరాటంకంగా కొనసాగుతోన్న చేప మందు పంపిణీ - FISH MEDICINE DISTRIBUTION
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు పంపిణీ కొనసాగుతోంది. నేటితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా నిర్వాహకులు దృష్టి సారించారు. ఇప్పటికే సుమారు 60 వేల మంది వరకు ప్రసాదం అందినట్లు నిర్వాహకులు తెలిపారు.
పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక రోగుల ఇబ్బందులు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్లో వచ్చే విధంగా చూస్తున్నారు. గతేడాది 81వేలకు పైగా ఉబ్బస రోగులు చేప ప్రసాదం తీసుకున్నారు. ఈసారి సుమారు 90వేల మంది వరకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షా 40వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : 'అయారాం... గయారాం సంస్కృతి కాంగ్రెస్‌దే'
Last Updated : Jun 9, 2019, 7:57 AM IST