రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రానికి సమీపంలో గల శీతల్ రిఫరెన్సెస్ అనే పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితమే గాజు వస్తువులు తయారుచేసే ఈ పరిశ్రమ మూతపడింది. కాగా సోమవారం ఉన్నట్టుండి ఈ పరిశ్రమలో మంటలు చేలరేగాయి. ఇందులో ఉన్న మిషన్లను తొలగించే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగాఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టం ఏ మేరకు జరిగిందన్నది అంచనా వేయవలసి ఉంది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Fire Accident In Closed indurstry At Nandigama
రంగారెడ్డి జిల్లా నందిగామలో మూతపడిన గాజు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.
మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం