రాష్ట్రంలో సవరించిన తాజా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్‌సభ నియోజక వర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. భారీగా పెరిగిన ఓటర్లు
మొన్నటి శాసనసభ ఎన్నికల సమయంలో ప్రకటించిన జాబితాతో పోలిస్తే ఇప్పటికి కొత్తగా మూడు లక్షల 89వేల 676 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,49,19,751. మహిళా ఓటర్లు 1,47,76,024మంది, ఇతరులు 1,504 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 6,52,744 మంది, దివ్యాంగులు 5,13,762 మంది ఉన్నారు.
మొదటి స్థానంలో మల్కాజిగిరి
లోకసభ నియోజక వర్గాల్లో అత్యధికంగా మల్కాజిగిరి నుంచి 31,49,710 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా మహబూబాబాద్ నుంచి 14,23,351 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇదీ చదవండి:మొత్తం 795... నిజామాబాద్‌లో 245