తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మేమూ ఆత్మగౌరవంతో బతకగలం'

ట్రాన్స్​జెండర్ అంటేనే సమాజంలో ఓ చిన్నచూపు ఉంటుంది. చాలా మంది ఏహ్యభావంతో చూస్తారు. సమాజంలో డబ్బులు అడుగుతూ జీవిస్తారని భావిస్తుంటారు. అయితే మేమూ అత్మగౌరవంతో జీవించగలమని నిరూపించారు కర్ణాటక చిత్రదుర్గలోని కొందరు ట్రాన్స్​జెండర్లు.

ట్రాన్స్​జెండర్లు నిర్వహిస్తున్న హోటల్

By

Published : Mar 9, 2019, 8:10 PM IST

Updated : Mar 9, 2019, 9:31 PM IST

కర్ణాటక చిత్రదుర్గలో జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఓ దాబా ఉంది. పట్టణంలో మంచి రుచికర భోజనం దొరికే ప్రదేశాల్లో ఇదీ ఒకటి. చిత్రదుర్గ కోటను సందర్శించేందుకు వచ్చిన వారిని 'సతారా దాబా' ఆహ్వానిస్తుంది. అయితే ఈ దాబాను నడిపేది ట్రాన్స్​జెండర్లు.

ట్రాన్స్​జెండర్లు నిర్వహిస్తున్న హోటల్

తమకూ ఆత్మగౌరవముందని తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. ఎవరూ సాయం చేయకపోయినా స్వతంత్రంగా సాధికారత సాధించగలమని నిరూపించారు హాటల్​ నిర్వహిస్తోన్న భావన బృందం.

"స్వతంత్రంగా జీవించేందుకు బ్యాంకు రుణానికి ప్రయత్నించాం. వారు ఎలాంటి సాయం చేయలేదు. దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాను. పెట్టుబడి కోసం నా దగ్గర ఉన్న వస్తువులను తాకట్టు పెట్టాను."
-భావన, హోటల్​ నిర్వాహకురాలు

ప్రస్తుతం రోజుకు రూ. ఐదు నుంచి ఆరు వేల వరకూ ఆదాయం లభిస్తోందని భావన చెబుతున్నారు. హోటల్​ నుంచి వచ్చిన కొంత ఆదాయాన్ని ప్రజాసేవ కోసం వినియోగించటం కొసమెరుపు. స్థానిక ప్రజల కోసం నీటి శుద్ధియంత్రాన్ని తమ సొంత డబ్బుతో కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:అమెరికాలో మేయర్​గా మేక!

Last Updated : Mar 9, 2019, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details