తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించేలా టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు పోస్టు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి వీడియోలు పోస్టు అయినట్లు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. జిల్లాలోని తిరువూరుకు చెందిన తగరం నవీన్ ఈ వీడియోలు పెట్టినట్లు చెప్పారు. డిగ్రీ చదివే నవీన్ మద్యం మత్తులో ఈ పని చేశాడని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు రేకెత్తించేలా ఉన్న ఆ వీడియోపై ఈనెల 20న వీ రామ నరసింహగౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నిందితుడుని అదుపులోకి తీసుకున్నామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
కేసీఆర్‌ను అవమానించే వీడియోలు, వ్యక్తి అరెస్ట్
టిక్‌టాక్ యాప్‌లో తెలంగాణ ప్రజలను అవమానించేలా వీడియోలు పోస్టు చేసిన ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
tiktak viedeo