తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఫేస్​బుక్ కొత్త యాప్​తో డబ్బు సంపాదించండి ఇలా!

స్మార్ట్​ఫోన్​ వినియోగదారులు సులభంగా డబ్బులు సంపాదించే సరికొత్త యాప్​ను ఫేస్​బుక్​ విడుదల చేసింది. మీ ఫోన్లో ఏ యాప్​లు వాడుతున్నారు, వాటి పనితీరు ఎలా ఉందనే వివరాలు ఈ కొత్త యాప్​ ద్వారా తెలపాల్సి ఉంటుంది. అందుకు మీకు డబ్బులు కూడా చెల్లిస్తుంది ఫేస్​బుక్​.

డబ్బులు చెల్లించే ఫేస్​బుక్ కొత్త యాప్​

By

Published : Jun 12, 2019, 6:22 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​... స్మార్ట్​ఫోన్ వినియోగదారులకు బంపర్​ ఆఫర్​ అందిస్తూ సరికొత్త యాప్​ను మంగళవారం విడుదల చేసింది. 'స్టడీ' అప్లికేషన్​​ ద్వారా మీ ఫోన్​లో ఏ యాప్​లు వినియోగిస్తున్నారు, అందులో ఎలాంటి ఫీచర్స్​ నచ్చాయనే విషయాలు తెలిపితే చాలు మీకు డబ్బులు చెల్లిస్తుంది ఫేస్​బుక్​. గూగుల్​ ప్లే స్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐ-ఫోన్​ వినియోగదారులకూ ఈ అవకాశం కల్పించనున్నారు.

స్టడీ యాప్​ ద్వారా మీరు ఇవ్వాల్సిన వివరాలు

  • ఏ యాప్​లు వినియోగిస్తున్నారు.
  • ఎంతకాలంగా వినియోగిస్తున్నారు.
  • ఏ ఫీచర్​ను ఎక్కువగా వాడుతున్నారు.

స్టడీ యాప్​ వినియోగదారుల ఐడీ, పాస్​వర్డ్​ వివరాలను సేకరించబోమని ఫేస్​బుక్​ తెలిపింది. తరచూ వారి నుంచి పొందే సమాచారం గురించి నోటిఫికేషన్​ ద్వారా గుర్తు చేస్తామని స్పష్టం చేసింది.

స్టడీ యాప్​ వినియోగించినందుకు ఎంత చెల్లిస్తారనే విషయంపై ఫేస్​బుస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ యాప్​ను​ అమెరికా, భారత్​లో మాత్రమే వినియోగంలోకి తీసుకొచ్చారు.

పోటీదారులను ఎదుర్కొనేందుకే ఈ కొత్త యాప్​ను ప్రవేశపెట్టినట్లు ఫేస్​బుక్​ పేర్కొంది. వినియోగదారుల ఫీడ్​బ్యాక్​తో మరింత సాంకేతికత జోడించి తమ యాప్​ను అందరికీ చేరువయ్యేలా చేసేందుకే దీనిని రూపొందించినట్లు తెలిపింది.

గతంలో ఇలాంటి తరహా యాప్​లనే రెండింటిని ప్రారంభించింది ఫేస్​బుక్​. 'రీసెర్చ్​' పేరుతో ఉన్న యాప్​ యాపిల్​ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఈ ఏడాది ఆరంభంలో నిషేధానికి గురైంది. 'ఒనావో ప్రొటెక్ట్'​ పేరుతో ఉన్న మరోయాప్​ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఫిర్యాదులతో మూతపడింది.

ఇదీ చూడండి: జులై 1 నుంచి ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీలు తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details