ఈ ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రం "ఎఫ్ 2". వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులకు నవ్వులు పంచిందీ సినిమా. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
బాలీవుడ్‌లోనూ తోడల్లుళ్ల నవ్వుల హంగామా - దిల్ రాజ్
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన 'ఎఫ్2' హిందీలో రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజ్.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బాలీవుడ్లో రీమేక్ కానున్న ఎఫ్2 సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. దిల్‌రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా హిందీలో పునర్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్. ఈ రీమేక్‌కు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించనున్నారు.
ఇవీ చదవండి: