సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 14న ఎన్నికలు జరిగే జహీరాబాద్, మొగుడంపల్లీ, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో పోటీ చేసే అభ్యర్తులకు ఎన్నిక వ్యయాల వివరాల నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడో విడత ఎన్నికల్లో తమ ఖర్చుల వివరాలను నమోదు చేసే విధానంపై నమూనా పత్రాలను అందజేసి.... వాటిపై అభ్యర్థులు సమగ్ర సమాచారం అందించాలని జిల్లా సహాయ ఎన్నికల అధికారి అబ్దుల్ హమీద్ ఆదేశించారు.
ఎన్నికల్లో ఖర్చు నమోదుపై అభ్యర్థులకు అవగాహన - sangareddy
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరగబోయే మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నిక కోసం తాము పెట్టిన ఖర్చుల వివరాలపై సమగ్ర సమాచారం అందించాలని జిల్లా సహాయ ఎన్నికల అధికారి అబ్దుల్ హమీద్ ఆదేశించారు.
అభ్యర్థులకు అవగాహన