తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికల వేళ మత్తు వదిలిస్తున్న అధికారులు - సార్వత్రిక ఎన్నికలు

లోక్​సభ ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వేల సంఖ్యలో కేసులు నమోదు చేసింది అబ్కారీ శాఖ. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తోంది. గుడుంబా తయారీదారులను అరెస్టు చేసి కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.

ఎన్నికల వేళ మత్తు వదిలిస్తున్న అధికారులు

By

Published : Apr 4, 2019, 6:00 AM IST

Updated : Apr 4, 2019, 11:45 AM IST

ఎన్నికల వేళ మత్తు వదిలిస్తున్న అధికారులు
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి మద్యం అక్రమ సరఫరాపై అబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 340 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. దుకాణాల వారీగా, బార్ల వారీగా జరిగే మద్యం విక్రయాలపై నిఘా పెట్టి రోజువారీ అమ్మకాలపై ఆరా తీస్తోంది. సాధారణ విక్రయాల తర్వాత 20 శాతానికి మించి అమ్మకాలు జరిగితే ప్రత్యేక పర్యవేక్షణతోపాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిషేధం ఉన్న గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఇప్పటికే వేలల్లో కేసులు...

ఇళ్లల్లో సైతం 6 మద్యం సీసాల కంటే ఎక్కువ నిల్వ పెట్టుకున్నా నిబంధనలకు విరుద్ధమేనంటూ కేసులు పెడుతున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన మద్యం దుకాణాదారులు, బార్లు, క్లబ్‌లపై ఇప్పటివరకు 2,280 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 1,216 మందిని అరెస్ట్‌ చేసి.. గుడుంబా తయారీదారులపై మరో 775 కేసులు నమోదు చేశారు. నాటుసారా తయారీ, రవాణాచేసే హాబిచ్యువల్‌ అఫెండర్స్‌ 535 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

కట్టుదిట్టమైన నిఘా...

బయట రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యం అక్రమంగా తరలించకుండా 36 ప్రాంతాల్లో సరిహద్దు తనిఖీ కేంద్రాలు, 14 మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... నిఘా మరింత పటిష్ఠం చేస్తామని అబ్కారీ శాఖ వెల్లడించింది.

ఇవీ చూడండి:రూ.3.47కోట్లను ఈసీకి అప్పగించిన కండక్టర్​

Last Updated : Apr 4, 2019, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details