కన్వీనర్ కోటాలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగిసింది. రేపటి నుంచి జులై ఐదో తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో నాలుగు సెంటర్లు, వరంగల్‌లో ఒక సెంటర్ మొత్తం ఐదు సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. నాన్‌లోకల్ అభ్యర్థులతో పాటు స్పెషల్ కేటగిరి అభ్యర్థులకు జేఎన్టీయూలో ఈనెల 29 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు... లోకల్ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఏవీ కాలేజ్, పీజీఆర్ ఆర్ సీడీఈ ఉస్మానియా క్యాంపస్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జులై 4వ తేదీ వరకు, నిజాం కాలేజీలో జులై 1 నుండి నాలుగో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ర్యాంకుల వారిగా నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. పూర్తి సమాచారం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in , www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
రేపటి నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ ధ్రువపత్రాల పరిశీలన
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఖరారు చేసింది. రేపటి నుంచి జులై ఐదో తేదీవరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
రేపటి నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ ధ్రువపత్రాల పరిశీలన