తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఫరూక్​ అబ్దుల్లా మరో రెండేళ్లు పోలీసుల అదుపులోనే! - వైగో

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాను కఠినమైన ప్రజా రక్షణ చట్టం(పీఎస్​ఏ) కింద అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం ఏ వ్యక్తినైనా ఎలాంటి విచారణ లేకుండా 6 నెలల నుంచి రెండేళ్లు నిర్బంధంలోనే ఉంచొచ్చు.

ఫరూక్​ అబ్దుల్లా అదృశ్యం వెనుక కారణం ఆ చట్టమే!

By

Published : Sep 16, 2019, 4:01 PM IST

Updated : Sep 30, 2019, 8:17 PM IST

ఫరూక్​ అబ్దుల్లా మరో రెండేళ్లు పోలీసుల అదుపులోనే!

ఆగస్టు 5 నుంచి గృహ నిర్బంధంలోనే ఉంటున్న జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాపై కేంద్రం కఠిన చట్టం ప్రయోగించింది. ఇప్పటివరకు సాధారణ నిర్బంధంలో ఉన్న ఆయన్ను ప్రజా రక్షణ చట్టం(పీఎస్​ఏ) కింద ఆదివారం అరెస్ట్​ చేసినట్లు హోం శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

పీఎస్​ఏలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్టు, రెండోది దేశ భద్రతకు ముప్పు నేపథ్యంలో నిర్బంధం.

పీఎస్​ఏ చట్టంలోని మొదటి సెక్షన్ ప్రకారం.. ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా 6 నెలల పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. రెండోదాని ప్రకారం.. గరిష్ఠంగా రెండేళ్లు అదుపులో ఉండాలి.

పీఎస్​ఏ జమ్ముకశ్మీర్​కు మాత్రమే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా దీనిని జాతీయ భద్రతా చట్టం(ఎన్​ఎస్​ఏ)గా పరిగణిస్తారు.

జైలుగా ఫరూక్​ నివాసం...

ఫరూక్​ అబ్దుల్లా శ్రీనగర్​ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమ్మూకు మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో శ్రీనగర్ గుప్కార్​ రోడ్డులోని ఆయన నివాసాన్ని జైలుగా ప్రకటించారు.

ఫరూక్​ అబ్దుల్లాను న్యాయస్థానంలో ప్రవేశపెట్టేలా ఆదేశించాలని... తమిళనాడు ఎండీఎంకే అధినేత వైగో దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణకు సరిగ్గా ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

ఇదీ చూడండి:బైక్​పై తండ్రి శవాన్ని మోసుకొచ్చిన యువకుడు

Last Updated : Sep 30, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details