తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రత్యేకహోదాపై కేసీఆర్​తో కేంద్రానికి లేఖ రాయించగలరా - చంద్రబాబు

సీఎం కేసీఆర్ ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నట్లు కేంద్రానికి జగన్ లేఖ రాయించగలరా అని ఏపీ సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన ఐదు అంశాలపై తెరాస వైఖరి తెలపాలన్నారు.

babu

By

Published : Apr 8, 2019, 8:59 PM IST

ఏపీకి ప్రత్యేకహోదాపై అభ్యంతరం లేదని కేసీఆర్​తో కేంద్రానికి జగన్​ లేఖ రాయించగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. "పోలవరంపై వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకునేలా చేయగలరా... శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వనరులపై ఆంధ్ర హక్కులకు రక్షణ కల్పించగలరా... హైదరాబాద్ ఆస్తుల విషయంపై న్యాయం చేయించగలరా... కీలకమైన ఐదు అంశాల్లో ఏపీకి న్యాయం జరిగినప్పుడు జగన్ చెప్పిన మాటలకు విశ్వసనీయత ఉంటుంది." అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ

ABOUT THE AUTHOR

...view details