తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎరిక్సన్-ఆర్​కామ్​ కేసు తీర్పు వాయిదా - ericsson

ఆర్​కాం అధినేత అనిల్​ అంబానీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్​ ఇండియా సంస్థ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. కేసును పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

అనిల్​ అంబానీ, ఎరిక్సన్​

By

Published : Feb 13, 2019, 5:39 PM IST

Updated : Feb 13, 2019, 6:11 PM IST

రిలయన్స్​ కమ్యూనికేషన్స్(ఆర్​కాం) అధినేతపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎరిక్సన్​ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. జస్టిస్​ ఆర్​ ఎఫ్​ నారిమన్​, జస్టిస్​ వినీత్​ శరణ్​ తో కూడిన ధర్మాసనం కేసుపై వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పును వేసింది.

అనిల్​ అంబానీ తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదని, వడ్డీతో సహా మొత్తం బకాయిలు చెల్లించేలా చూడాలని ఎరిక్సన్​ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంబానీతో పాటు మరో ఇద్దరి పేర్లను ఈ వ్యాజ్యంలో పేర్కొంది.

ప్రముఖ సీనియర్​ న్యాయవాది దుశ్యంత్ దేవ్​ ఎరిక్సన్​ ఇండియా తరఫున వాదనలు వినిపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆర్​కాం అధినేత ధిక్కారించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దుశ్యంత్​ కోర్టుకు తెలిపారు.

కోర్టుకు హాజరైన అంబానీ

ఆర్​కాం అధినేత అనిల్​ అంబానీతో పాటు రిలయన్స్​ టెలికాం లిమిటెడ్​ ఛైర్మన్​ సతీశ్​ సేథ్​, రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​ లిమిటెడ్​ ఛైర్​ పర్సన్​ ఛాయా విరాని కోర్టుకు హాజరయ్యారు.

మునుపటి తీర్పులో ఏముంది..

గతేడాది అక్టోబర్​ 23న ఎరిక్సన్​ పిటిషన్​పై ధర్నాసనం తీర్పును వెలువరించింది. డిసెంబర్​ 15, 2018 లోగా ఆర్​కాం అధినేత, ఎరిక్సన్​ సంస్థకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది.

Last Updated : Feb 13, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details