తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎలుకల మందు రుచి చూశాడు.. తరువాత..! - ap latest ap news

ఎలుకల నివారణ మందు పనిచేస్తుందో లేదోనని నిర్లక్ష్యంతో నాలుకపై వేసుకుని రుచి చూసిన యువకుడు మృతి  చెందాడు.  ఈ విషాద ఘటన ముసునూరు  చర్చిలో శనివారం జరిగింది.

ఎలుకల మందు రుచి చూసి..చనిపోయాడు..!

By

Published : Jun 17, 2019, 9:52 AM IST

ఎలుకల మందు రుచి చూసి..చనిపోయాడు..!

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా ముసునూరులో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాస్‌పూర్‌ జిల్లా పాతల్‌గో మండలంలోని ఈకెరా గ్రామానికి చెందిన రాబర్ట్‌ కిస్పోటా... గత కొంతకాలంగా ముసునూరు చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఇక్కడ ఎలుకల బెడద నివారణకు మందు తీసుకొచ్చారు. అది కొత్తగా ఉందని ..పనిచేస్తుందో లేదోనని ఈనెల 9వ తేదీన కొద్దిగా నాలుకపై రాసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే దాన్ని ఉమ్మేసి.. ముఖం కడుక్కుని ఏమీ కాదనే ధీమాతో ఉన్నాడు...రాబర్ట్​.

మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నూజివీడు అమెరికన్‌ ఆసుపత్రికి అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరి రంజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి..ఆరునెలల గర్భిణీకి నిప్పు... అనుమానంతో భర్త దాష్టికం

ABOUT THE AUTHOR

...view details