దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ఈసీ ప్రకటించింది. ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు ఈ నెల 23న ఓట్ల లెక్కింపు పూర్తైంది.
17వ లోక్‌సభను ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త సభ కొలువుదీరిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు సమాచారం పంపింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన ఈసీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తై కొత్త సభ ఏర్పాటైన నేపథ్యంలో ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.
model code of conduct
ఇదీ చూడండి: మంత్రివర్గ విస్తరణ ఉంటుందా!
Last Updated : May 26, 2019, 11:21 PM IST