తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాయ్ రాజా కాయ్.. కోట్లల్లో డబ్బులు పోయాయ్!

ఎన్నికల ఫలితాలు బెట్టింగ్​ రాయుళ్ల కొంపముంచాయి. వేలకు వేలు.. లక్షలకు లక్షలు పందెంలో పెట్టి చేతులు కాల్చుకున్నారు. తమ అంచనాలకు.. సర్వే ఫలితాలు జోడించుకుని వేల రూపాయలు నష్టపోయారు. కొందరు భూములు పందెం కాయగా, ఇంకొందరు నగదు రూపంలో ఆస్తులు కోల్పోయారు. రాజకీయ నేతలూ బెట్టింగ్​ వేసి నాలుక కరుచుకున్న సందర్భాలు అక్కడక్కడా వెలుగుచూశాయి.

By

Published : May 23, 2019, 10:06 PM IST

కాయ్ రాజా కాయ్.. కోట్లల్లో డబ్బులు పోయాయ్!

కాయ్ ​రాజా కాయ్​ నీవు బెట్ వేసిన పార్టీ గెలిస్తే రెండితలు అదే ఓడిపోతే ఒకింత ఇవ్వు .. అన్నట్టుగా.. ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు జరిగాయి. ఫలితాల జోరులో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చివరికి.. క్షణాల్లో అంచనాలు తల్లకిందులై జేబులు గుల్లయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్​లు జోరుగా సాగాయి. స్కూలు పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ ఎవరి నోట విన్నా నేతల నామస్మరణే. పార్టీలు తమవేనన్నట్టుగా మాటల యుద్దాలు.. నోట్ల కట్టలు బెట్టింగులు. అంచనాలు మారిపోయి ఓడిన వాడు బేకారైతే గెలిచిన వాడు పండగ చేసుకున్నారు.

బడా నేతలపై బడా మొత్తం

ఎన్నికల్లో కీలక నేతల గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన వారికి మతిపోయాలా ఫలితాలు వచ్చాయి. ఎంతో కాలంగా పార్టీల్లో పాతుకుపోయి గెలుపే తప్ప ఓటమంటే తెలియని నేతలూ పరాజితులయ్యారు. కచ్చితంగా గెలుస్తుందనుకున్న స్థానం నుంచి ఓటమి పాలవడం... అభ్యర్థులతో పాటు, బెట్టింగ్ రాయుళ్లకూ ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

సాంకేతిక సాయంతో...

ఇంతకు ముందు బెట్టింగులు చేసే వ్యక్తులు... నేరుగా లావాదేవీలు జరిపేవారు. పందెం​ మొత్తం తక్కువగానే ఉండేది. ఇప్పుడు.. సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల... అంతర్జాలంలో బెట్టింగులు పెరిగిపోయాయి. క్షణాల్లో రూపాయలు ఖాతాల్లోంచి వెళ్లిపోయాయి. అప్పులు చేసి మరీ కొందరు బెట్టింగులు కాసి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. రౌండు రౌండుకూ రేటు పెంచూతూ లక్షల రూపాయలు చేతులు మారాయి. క్షణాల్లో కాసులు కుమ్మరించుకున్నారు. సరైన పర్యవేక్షణ లోని కారణంగా.. ఈ సారీ బెట్టింగ్ రాయుళ్ల దందా దర్జాగా కొనసాగినట్టు తెలుస్తోంది. బయటికి ఎవరూ చెప్పకపోయినా.. ఈ వ్యవహారంతో రూ.కోట్లల్లో నష్టపోయినవాళ్లు చాలామందే ఉన్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: తెరాస 9... భాజపా 4... కాంగ్రెస్ 3... ఎంఐఎం 1

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details