13 కేంద్రాల్లో కొనసాగుతున్న రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తవుతుందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని ఈరోజు సాయంత్రం వరకు గడువుండగా మరికొన్ని వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
'రీ వెరిఫికేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తాం'
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు చెప్పామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అన్నారు.
విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి