తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రిజర్వ్ అయిన కేటగిరీల్లో ఒక్కరే ఎన్నికైతే వారికే పదవి - ec-new-guidelines-on mpp, zp chairpersons elections

అధ్యక్ష పదవులు రిజర్వ్ అయిన కేటగిరీల్లో ఒక్కరే సభ్యులు ఎన్నికైతే వారికే పదవి దక్కేలా నిబంధన ఈసీ నిబంధనలు జారీ చేసింది. కోరం లేకపోయిన ఎన్నిక నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు అధికారం ఇచ్చింది.

new-guidelines

By

Published : Jun 7, 2019, 8:39 PM IST

Updated : Jun 7, 2019, 10:42 PM IST

ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు

మండల, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అధ్యక్ష పదవులు రిజర్వ్ అయిన కేటగిరీల్లో ఒక్కరే సభ్యులు ఎన్నికైతే వారికే పదవి దక్కేలా నిబంధనలు సవరించారు. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

అధ్యక్ష పదవి రిజర్వ్ అయిన కేటగిరీ సభ్యులు ఒక్కరే ఉంటే ప్రతిపాదకులు, బలపరిచేవారు లేకుండానే నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఆ తరహా నామినేషన్లు పరిగణలోకి తీసుకొని పాలకమండలి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక చేపట్టాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సందర్భాల్లో కోరం లేకపోయినపోయినప్పటికీ ఎన్నిక నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇదీ చూడండి: "పార్టీ కోసం కాదు... ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం"

Last Updated : Jun 7, 2019, 10:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details