క్రికెట్ అంటే ఫిట్‌గా ఉండాలనే హద్దులు చెరిపేశాడు. ఆటకు బరువు సమస్య కాదని నిరూపించాడు. 2007 ప్రపంచకప్‌లో మార్చి 19న అంటే సరిగ్గా ఇదే రోజున... భారత్- బెర్ముడా మధ్య జరిగిన మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప క్యాచ్‌ని ఒంటి చేత్తో పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ క్రికెటర్. అతడే బెర్ముడాకు చెందిన డ్వేన్ లెవరాక్. టోర్నీలో అతడు క్యాచ్ పట్టిన వీడియో.. క్రికెట్ అభిమానుల్ని విపరీతంగా ఆకర్షించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం అతడుజైలర్గానూ విధులునిర్వర్తిస్తున్నాడు.
భారీ క్రికెటర్.. క్యాచ్ భళా - ఉతప్ప
సరిగ్గా పన్నెండేళ్ల క్రితం బెర్ముడా జట్టుకు చెందిన ఓ భారీకాయుడు ప్రపంచకప్‌లో పట్టిన క్యాచ్.. క్రీడాభిమానుల్ని విపరీతంగా ఆకర్షించింది.
![భారీ క్రికెటర్.. క్యాచ్ భళా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2731803-35-0425f8e6-d374-4b19-acaf-a50632f5e0ff.jpg)
ఒక్క క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన డ్వేన్ లెవరాక్
అంతర్జాతీయ క్రికెట్లోకి ఆ టోర్నీతోనే అరంగేట్రం చేసింది బెర్ముడా జట్టు. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ఘనత సాధించింది.ఈ మెగాటోర్నీలో తొలిసారిగా 400 పరుగుల మార్క్‌ను దాటింది.
Last Updated : Mar 19, 2019, 8:50 PM IST