పిల్లల ప్రాణాలంటే అంత అలుసా? - అరెస్టు
విస్మయపరిచిన ముంబయి పాఠశాల బస్సు డ్రైవర్ నిర్వాకం.

తాజాగా ముంబైలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకం విస్మయానికి గురిచేస్తోంది. గేర్ రాడ్డు స్థానంలో వెదురు కర్రను ఉపయోగించి బస్సును నడిపాడు సదరు డ్రైవర్. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ వెదురు కర్రనే గేర్ రాడ్డు స్థానంలో వాడుతూ బస్సుతో బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. బస్సును వెంబడించి పట్టుకున్న కారు డ్రైవర్ గేర్ రాడ్డు స్థానంలో వెదురు కర్రను చూసి అవాక్కయ్యాడు. డ్రైవర్ రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరమ్మతుకు సమయం లేకపోవడం వల్లే కర్రతో బస్సు నడుపుతున్నట్టు డ్రైవర్ వివరించాడు. మూడేళ్లుగా ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది.