'మిషన్ శక్తి' భారత్ సాధించిన అద్భుత విజయమని డీఆర్డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. భారత సాంకేతిక, సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయన్నారు. మిషన్శక్తికి అనుమతులు రెండేళ్ల కిందటే మంజూరయ్యాయని వెల్లడించారు.
రోదసిలోని ఓ ఉపగ్రహాన్ని పడగొట్టిన మన దేశం... అంతరిక్ష సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలిచిందన్నారు. మిషన్ శక్తికి ఉపయోగించిన సాంకేతికత అంతా దేశీయంగా తయారు చేసిందేనని స్పష్టం చేశారు సతీశ్‌రెడ్డి.