కోల్‌కతాలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. గత మూడురోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలోని మరిన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది నిరసనలు చేపట్టనున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైద్య సేవల్ని ఆపేస్తామని ఐఎంఏ పేర్కొంది. కోల్‌కతాలో ఘటనకు కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రధానికి డాక్టర్ రఘురాం లేఖ