కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఏపీకి చెందిన వైద్యుడు సుధాకర్… ఇవాళ విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసుల ఆధీనంలో ఉన్న కారులోని ఏటీఎం కార్డు తీసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పారు. సీబీఐ విచారణలో ఉన్నందున ఏటీఎం కార్డు ఇవ్వలేమని పోలీసులు చెప్పారని వెల్లడించారు. నర్సీపట్నంలో మత్తు వైద్యుడు ఉండకూడదనే ఉద్దేశంతోనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. గత నెల 16న తన కారులో ఉన్న రూ.10లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని తెలిపారు. తనను ముందు నుంచి ఇద్దరు వ్యక్తులు అనుసరించారని, వారే నగదు దోచుకెళ్లారని చెప్పారు. అనంతరం కొంతమంది వచ్చి తనను చంపేందుకు యత్నించారని చెప్పారు. ఆ తర్వాత ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల కారణంగానే తాను సస్పెన్షన్‌కు గురయ్యాయని, గతంలో చాలా మందికి ఇలాగే జరిగిందని సుధాకర్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. సస్పన్షన్‌కు గురై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న తనకు మిత్రులందరూ కలిసి డబ్బులు ఇచ్చారని, వాటిని దుండగులు ఆరోజు దొంగిలించారని డాక్టర్ సుధాకర్ తెలిపారు. మానసిక ఆసుపత్రిలో సిబ్బంది తనతో పిచ్చివాడిలా ప్రవర్తించారని, మానసిక ఆసుపత్రిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. మీడియాతో మాట్లాడవద్దని సీబీఐ చెప్పిందని తెలిపారు.
సీపీ అసహనం