తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏటీపీ కప్: నాదల్, జకోవిచ్ మరోసారి - నాదల్ న్యూస్

మరోసారి ఏటీపీ కప్​లో తలపడేందుకు స్టార్ క్రీడాకారులు జకోవిచ్, నాదల్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి మ్యాచ్​లో మొదలుకానున్నాయి.

Djokovic, Nadal set to return for 2nd ATP Cup in Australia
జకోవిచ్, నాదల్

By

Published : Jan 6, 2021, 7:14 AM IST

ఏటీపీ కప్‌లో మరోసారి ఆడేందుకు ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌, రఫెల్‌ నాదల్‌ సిద్ధమయ్యారు. వివిధ జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 1న ఆరంభం కానుంది. ఈ ఏడాది షురూ కానున్న తొలి టోర్నీ ఇదే.

ఆస్ట్రేలియాలోని మూడు ప్రాంతాల్లో గత సంవత్సరం నిర్వహించిన మొదటి టోర్నీలో 24 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో రఫెల్‌ నాదల్‌తో కూడిన స్పెయిన్‌పై నొవాక్‌ జకోవిచ్‌ నేతృత్వంలోని సెర్బియా విజయం సాధించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 12 జట్ల మధ్య టోర్నీ నిర్వహించనున్నారు. ఈనెల 20న డ్రా తీయనున్నారు. 12 జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ అనంతరం గ్రూపు విజేత సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

ఇది చదవండి:ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్

ABOUT THE AUTHOR

...view details