బెంగళూరుతోమంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీ, డివిలియర్స్ల వికెట్లు తీశాడు శ్రేయస్ గోపాల్. తన కెరీర్లోనే ఇది మరిచిపోలేని అనుభవమని చెప్పాడీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్.
ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు గోపాల్. ఇతని ప్రదర్శనతో రాజస్థాన్ జట్టు బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.
కోహ్లీ, డివిలియర్స్ వికెట్లు తీయాలనేది ప్రతి యువ క్రికెటర్ కల. వారిని ఔట్ చేయడం నా కెరీర్లో మరిచిపోలేని అనుభవం. ఇంకా బాగా రాణించాలని కోరుకుంటున్నాను -శ్రేయస్ గోపాల్, రాజస్థాన్ బౌలర్
జట్టులోని అనుభవజ్ఞులైన రహానే, స్మిత్ నుంచి ఎంతో నేర్చుకున్నానని గోపాల్ తెలిపాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బాధ్యతగా భావిస్తానన్నాడు.
ఓవర్ల మధ్యలో జట్టులోని సీనియర్ల సలహాలు తీసుకున్నాను. వారు ఏం చెప్తున్నారో అది పాటించేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే ఆటలో వారికి అనుభవమెక్కువ -శ్రేయస్ గోపాల్, రాజస్థాన్ బౌలర్