తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దసరా బరిలో రవితేజ 'డిస్కోరాజా' - రవితేజ

ముగ్గురు భామలతో రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

దసరాకి విడుదల కానున్న డిస్కోరాజా సినిమా

By

Published : Mar 19, 2019, 8:39 AM IST

Updated : Mar 19, 2019, 8:35 PM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న `డిస్కోరాజా` ద‌స‌రాకు సంద‌డి చేయ‌నుంది. పాయల్ రాజ్​పుత్, నభా నటేష్ కథానాయికలుగా అలరించనున్నారు. మరో హీరోయిన్​కు చోటుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేం వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ త‌ళ్లూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. ముంబయి, గోవా, లఢక్‌ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రానికి తమ‌న్ స్వ‌రాలు సమకూరుస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌లు అందిస్తున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. రవితేజ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని, ఆయన మాఫియా డాన్‌గానూ నవ్వులు పంచనున్నారని తెలుస్తోంది.

Last Updated : Mar 19, 2019, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details