దిల్లీలో మరో అగ్నిప్రమాదం - పేపర్ మిల్లు దగ్ధం
దిల్లీ నరైనా పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ కార్డ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వరుస అగ్ని ప్రమాదాలతో దిల్లీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
దిల్లీలో పేపర్ మిల్లు దగ్ధం
మంగళవారం దిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.