చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ మొదటి మ్యాచ్‌ను గెలిచి ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించాయి. ఒక జట్టేమో బౌలింగ్‌తో ప్రత్యర్థి పని పడితే.. భారీస్కోరుతో గెలుపు రుచి చూసింది మరో జట్టు. నేడు ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
అనుభవజ్ఞుడైన ధోని కెప్టెన్సీలో చెన్నై జట్టు మరో మ్యాచ్‌ను గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ముంబయితో తొలి మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన పంత్‌పై దిల్లీ మేనేజ్మెంట్ భారీ ఆశలే పెట్టుకుంది.
ఇరు జట్ల బలాబలాలు..
చెన్నై సూపర్ కింగ్స్
బలాలు: వాట్సన్, రాయుడు, రైనా, ధోని, జాదవ్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో అందిరికీ పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. స్పిన్‌కు అనుకూలించే కోట్లా మైదానంలో వీరికే అవకాశాలు ఎక్కువ. బౌలర్లు హర్భజన్, తాహిర్, జడేజా.. స్పిన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
బలహీనతలు: పటిష్ఠమైన దిల్లీ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు కొంతమేర ఇబ్బంది పడొచ్చు.