ధోనీ జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురైన సంఘటనలు త్వరలో డాక్యుడ్రామాగా స్మార్ట్ తెరపై కనువిందు చేయనుంది. ‘రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో ‘హాట్‌స్టార్’ సంస్థ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొస్తోంది.
- ‘హాట్‌స్టార్ స్పెషల్స్’లో భాగంగా దీన్ని ఈ నెల 20 నుంచి ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ టీజర్ ఈ మధ్యే విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ షో వీక్షించవచ్చు. మిస్టర్కూల్ సహనిర్మాతగా వ్యవహరించడం విశేషం.