చాలా రోజుల తర్వాత సాధారణ భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మంది భక్తులకు, టైంస్లాట్ టోకెన్ల ద్వారా 3 వేలమందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పిస్తోంది తితిదే. 53 మందికి వీఐపీ టికెట్ల ద్వారా దర్శనం కల్పించింది.
సాధారణ భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాలు - తిరుమలలో భక్తులకు దర్శనాలు వార్తలు
మూడ్రోజుల ట్రయల్‌రన్ తర్వాత సాధారణ భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించింది తితిదే. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి అనుమతిస్తోంది.
తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు