తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రేపే డిప్యూటీ నోటిఫికేషన్​ - సభాపతి పోచారం

summary: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి కోసం శనివారం నోటిఫికేషన్​ జారీకానుంది. సోమవారం ఎన్నిక జరగనుంది.

బీఏసీ సమావేశం

By

Published : Feb 22, 2019, 7:19 PM IST

Updated : Feb 22, 2019, 8:39 PM IST

బీఏసీ సమావేశం

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరిగింది. సోమవారం వరకు బడ్జెట్ ​ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించనున్నారు. బీఏసీకి సీఎం కేసీఆర్​, మంత్రి ఈటల రాజేందర్​, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఉపసభాపతి ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్​ జారీకానుంది. రేపే నామినేషన్లు స్వీకరించి, సోమవారం ఎన్నిక నిర్వహిస్తారు. తెరాస తరపున సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్​ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని తెరాస భావిస్తోంది.

Last Updated : Feb 22, 2019, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details