తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వీవీ వినాయక్​కు చెందిన భవన నిర్మాణం కూల్చివేత

సినీ దర్శకుడు వీవీ వినాయక్​కు చెందిన నిర్మాణంలో ఉన్న ఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రెండంతస్తులకే అనుమతులుండగా.. ఆరంతస్తులు నిర్మిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు.

వీవీ వినాయక్​కు చెందిన భవన నిర్మాణం కూల్చివేత

By

Published : Jun 26, 2019, 11:39 PM IST

హైదరాబాద్​ నగర శివారు నార్సింగ్‌ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ ప్రాంతంలో సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ ఇంటిని సైతం కూల్చివేశారు. వీవీ వినాయక్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రెండంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులుండగా.. వినాయక్‌ ఆరంతస్తులు నిర్మిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్‌ అధికారులు వాటిని కూడా కూల్చివేయనున్నారు.

వీవీ వినాయక్​కు చెందిన భవన నిర్మాణం కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details