తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 7:45 PM IST

Updated : Mar 26, 2019, 7:54 PM IST

ETV Bharat / briefs

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్

దిల్లీ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు రెండో గెలుపుకై బరిలోకి దిగుతున్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్​. ఇరుజట్లు తమ మొదటి మ్యాచ్​ గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నాయి. సొంతగడ్డపై ఆడుతుండటం దిల్లీ క్యాపిటల్స్​కు కలిసొచ్చే అంశం.

అనుభవజ్ఞులతో కూడిన చెన్నై.. యువ దిల్లీ మీద పైచేయి సాధిస్తుందేమో చూడాలి. తొలి మ్యాచ్​లో బెంగళూరును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు చెన్నై బౌలర్లు. ముంబయితో జరిగిన తొలి మ్యాచ్​లో పంత్ వీర విహారంతో భారీ స్కోరు చేసింది దిల్లీ జట్టు.

ఇరుజట్లు ఇప్పటి వరకు 18 మ్యాచ్​లు ఆడగా చెన్నై 12, దిల్లీ 6 మ్యాచ్​లు గెలిచింది.

జట్లు

చెన్నై సూపర్ కింగ్స్: ధోని(కెప్టెన్), వాట్సన్, రాయుడు, రైనా, కేదార్ జాదవ్, జడేజా, బ్రావో, తాహిర్, హర్భజన్, శార్దూల్ ఠాకూర్, చాహర్​

దిల్లీ క్యాపిటల్స్: ధావన్, ఇన్​గ్రాం, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, పంత్, మోరిస్, విహారి, సందీప్ లామ్​చానే, ఇషాంత్, బౌల్ట్, రబాడా

Last Updated : Mar 26, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details