ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరోమారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆమె మరో దఫా ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది.
రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!
'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మరిన్ని ఉద్దీపనలు ప్రకటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆమె మీడియా సమావేశం జరగనుంది.
నిర్మల 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!
తొలి రోజు... ఎమ్ఎస్ఎమ్ఈలు, డిస్కంలు, గుత్తేదారులు, డెవలపర్స్‌కు సంబంధించి ఆరు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్... నేడు మరిన్ని రంగాలకు చేయూతనిచ్చే ప్రకటనలు చేస్తారని ప్రజలు వేచిచూస్తున్నారు.
Last Updated : May 14, 2020, 11:23 AM IST