నగదు చెల్లింపుల సమాచార భద్రతపై దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు ప్రభుత్వం వద్ద ఆందోళన వ్యక్తం చేసిన వేళ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-కామర్స్ కంపెనీల చెల్లింపులకు సంబంధించిన సమాచారం అంతా దేశంలోనే భద్రపర్చాలని, ఒక వేళ విదేశాల్లో ఉంటే 24 గంటల్లో అక్కడ తొలగించి స్వదేశానికి తీసుకురావాలని ఆదేశించింది.
చెల్లింపు వ్యవస్ధ నిర్వహణ సంస్ధలు విదేశాల్లో లావాదేవీలు జరగాలని కోరుకుంటే దానిపై ఎలాంటి అభ్యంతరాలు ఉండబోదని తెలిపింది.