తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆర్.ఆర్.ఆర్ నుంచి తప్పుకున్న ఓ హీరోయిన్ - డైసీ ఎడ్గర్ జోన్స్

ఆర్.ఆర్.ఆర్​లో నటిస్తున్న  బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకుంది. సంబంధిత విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

ఆర్.ఆర్.ఆర్ నుంచి తప్పుకున్న డైసీ ఎడ్గర్ జోన్స్

By

Published : Apr 6, 2019, 10:45 AM IST

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఓ హీరోయిన్​గా నటిస్తున్న డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకుంది. సంబంధిత విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్​ వేదికగా పంచుకుంది.

రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయికల్లో ఒకరిగా ఆలియా భట్ నటిస్తోంది. సముద్రఖని, అజయ్ దేవ్​గణ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details