తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఒక్కడై నిలిచిన ధోని..రాజస్థాన్​ లక్ష్యం 176 పరుగులు - ధోని

చెపాక్​లో జరిగిన మ్యాచ్​లో 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది చెన్నై సూపర్​ కింగ్స్​. కెప్టెన్ ధోని 75 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి రాజస్థాన్​ జట్టులో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఒక్కడై నిలిచిన మహేంద్రుడు

By

Published : Mar 31, 2019, 10:19 PM IST

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో 20 ఓవర్లకు 175 పరుగులు చేసింది సీఎస్​కే. కెప్టెన్ ధోని 75 పరుగులతో రాణించాడు. బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై రాజస్థాన్ బ్యాట్స్​మెన్ లక్ష్యాన్ని ఛేదిస్తారా లేదా అనేది చూడాలి.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టుకు అశించిన శుభారంభం లభించలేదు. ఒక పరుగు మాత్రమే చేసి రాయుడు పెవిలియన్ బాట పట్టాడు. మిగతా బ్యాట్స్​మెన్​లలో వాట్సన్ 13, జాదవ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ధోని ఒక్కడే...

కెప్టెన్ ధోని సమయోచితంగా ఆడి 75 పరుగులు చేశాడు. తనలోని ఆట తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రైనా ఉన్నంత సేపు ధోనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్​కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

తర్వాత వచ్చిన బ్రావో ఉన్నంత సేపు ధాటిగా ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. చివర్లో వచ్చిన జడేజా 8 పరుగులు చేశాడు.

ఆర్చర్ అదరహో..

రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కులకర్ణి, స్టోక్స్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.


ABOUT THE AUTHOR

...view details