తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి' - toilets

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లను సీఎస్​ ఎస్కేజోషి ఆదేశించారు. సచివాలయంలో అన్ని జిల్లాల పాలనాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు నెలాఖరు నాటికి నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు.

cs-video-conference

By

Published : May 14, 2019, 5:59 AM IST

Updated : May 14, 2019, 7:21 AM IST

స్వచ్ఛ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలన్నీ వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. 2019 అక్టోబర్​ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడమే లక్ష్యం అన్నారు.

ఐదు లక్షలకు పైగా పూర్తి కావాలి

రాష్ట్రంలో ఇంకా ఐదు లక్షలకు పైగా మరుగు దొడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని సీఎస్​ అన్నారు. ఆగస్టు నెలాఖరులోపు నిర్మాణం జరిగితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని పేర్కొన్నారు. అంగన్​వాడీ భవనాలు, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్​టీఎల్​లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్​ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.

'వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'
ఇదీ చదవండి: ఆ రోజు నగరమంతా దీపాలతో కళకళలాడాలి
Last Updated : May 14, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details