నమ్మి ఓటు వేసిన ప్రజలనే మోసం చేసిన వారు మిమ్మల్నీ మోసం చేస్తారని, జాగ్రత్తగా ఉండండి అని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ఫిరాయింపులను ప్రోత్సహించను అని, ఒకవేళ తమ పార్టీలో చేరాలనుకుంటే ఇతర పార్టీకి రాజీనామా చేసి రావాలన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. ఫిరాయింపులను నిరసిస్తూ హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
'కేసీఆర్.. జగన్ను చూసి నేర్చుకో : నారాయణ' - cpi national secretaray narayana
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మండిపడ్డారు.
'కేసీఆర్.. జగన్ను చూసి నేర్చుకో : నారాయణ'