తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"లోక్​సభ ఎన్నికల్లో వామపక్షాల విజయం ఖాయం" - bhuwanagiri

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధించడం ఖాయమని భువనగిరి సీపీఐ అభ్యర్థి గోద రాములు ధీమా వ్యక్తం చేశారు.

భువనగిరిలో సీపీఐ అభ్యర్థి ప్రచారం

By

Published : Apr 4, 2019, 12:34 PM IST

భువనగిరిలో సీపీఐ అభ్యర్థి ప్రచారం
గత ఐదేళ్లలో భువనగిరికి తెరాస ఎంపీ చేసిందేమీ లేదని భువనగిరి లోక్​సభ సీపీఐ అభ్యర్థి గోద రాములు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు. భువనగిరి ప్రజలు గత ఐదేళ్ల పాలనను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details