మంచిర్యాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ - cp-visit-counting-centre
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి హాల్లోని కౌంటింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి హాల్లోకి వెళ్లి కౌంటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొందని సీపీ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ చేయడానికి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసు అధికారుల అనుమతితో సంబురాలు చేసుకోవచ్చని సత్యనారాయణ తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
TAGGED:
cp-visit-counting-centre