తెలంగాణ

telangana

By

Published : May 21, 2019, 5:43 AM IST

ETV Bharat / briefs

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు

ఎగ్జిట్​ పోల్స్​ కాంగ్రెస్​ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపాయి. ముందస్తు అంచనాలు వచ్చిన మరుసటి రోజే దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయం కళతప్పింది. కొంతమంది నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి వచ్చారు. గంభీర వదనంతో కనిపించారు. మరోమారు మోదీ సర్కారు వస్తుందన్న ఎగ్జిట్​ పోల్స్ అంచనాల​ను తిరస్కరించారు.

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు

ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు
కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల మధ్య ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయి. ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడైన మరుసటి రోజున దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి నేతలు, కార్యకర్తలు వచ్చినా కళ తప్పిన వాతావరణం కనిపించింది. మరోమారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తిరస్కరించాయి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు. ​

ఆదివారం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​లో దాదాపు అన్ని సంస్థలు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 300 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేశాయి. మరోమారు మోదీ సర్కార్​ వస్తుందని స్పష్టం చేశాయి.

దిల్లీలోని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయంలో సాధారణంగా ఉండే హడావిడి వాతావరణం సోమవారం కనిపించలేదు. ఎగ్జిట్​ పోల్స్​ గందరగోళాన్ని సృష్టించాయని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈవీఎంలను ట్యాంపర్​​ చేసినట్లే..

"మేం(కాంగ్రెస్​) తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తాం. ఒక వేళ ఫలితాలు అలా రాలేదంటే.. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్టే​ లెక్క"

- రామ్​ సింగ్​, కాంగ్రెస్​ కార్యకర్త.

కాంగ్రెస్​దే అధికారం

గురువారం వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్​కే అధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్త సురేష్​ సింగ్​.

" గురువారం రోజున ఇక్కడ వేడుకలు జరుగుతాయని నాకు తెలుసు. హస్తం పార్టీ విజయం సాధిస్తుంది. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్డీఏకు కొన్ని సంస్థలు 22 సీట్లు వస్తాయని ప్రకటిస్తే మరికొన్ని 52 వస్తాయని తెలిపాయి. ఎగ్జిట్​ పోల్స్​ విశ్వసనీయతపై సందేహం కలుగుతోంది. అవి తప్పని తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "

- సురేష్​ సింగ్​, కార్యకర్త

భాజపా వ్యూహమే

దేశంలో అనిశ్చితి సృష్టించటం, మహాకూటమి పార్టీలను ఎన్డీఏలో కలుపుకునేందుకు భాజపా పన్నిన వ్యూహంలోని భాగమే ఈ ఎగ్జిట్​ పోల్స్​ అని ఆరోపించారు కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి నీతా మిశ్రా.

"ఎగ్జిట్​ పోల్స్​తో మేం ఎక్కడా నిరాశకు గురికాలేదు. భాజపాను చూసి చాలా మంది ప్రజలు భయపడ్డారని మాకు తెలుసు. కానీ కొన్ని సంస్థలు భాజపాకు భయపడి ప్రజలు ఆ పార్టీకే ఓటు వేశారని చెప్పాయి. కానీ ప్రజలు ఇతరులకు(వేరే పార్టీలకు) ఓటు వేశారు. చాలా సార్లు ఎగ్జిట్​ పోల్స్​ తప్పు అని రుజువయ్యాయి. ఈ పోల్స్​ని ఎవరూ నమ్మరు. ఈ ఎగ్జిట్​ పోల్స్​పై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి."

- నీతా మిశ్రా, కాంగ్రెస్​ పార్టీ విచార్​ విభాగం ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి:'గాడ్సే గొడవ': కమల్​కు కోర్టు చీవాట్లు, బెయిల్

ABOUT THE AUTHOR

...view details