అంటు వ్యాధుల నివారణ కోసం చేసుకునే బోనాల పండుగను నిలిపివేయటం సరైన చర్య కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు మండిపడ్డారు. మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం... ఒక్క బోనాలకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన ఆలోచనగా వీహెచ్ అభివర్ణించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు.
బోనాల పండుగ నిలిపివేయడం సరికాదు: వీహెచ్ - Lock down effect
బోనాల పండుగను నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఖండించారు. ఎంతో చరిత్ర కలిగిన బోనాలు ఆపాలనడం సరికాదని... నియంత్రణతో కూడిన బోనాలకు అనుమతి ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
నియంత్రణతో కూడిన బోనాలకు అనుమతి ఇవ్వాలి: వీహెచ్
ఎంతో చరిత్ర కలిగిన బోనాలు ఆపాలనడం సరికాదని... నియంత్రణతో కూడిన బోనాలకు అనుమతి ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. కొంతమంది మహిళలకైనా అవకాశం ఇవ్వాలని, ఇందువల్ల బోనాలపై ఆసక్తి ఉన్న మహిళలు బోనం ఎత్తుకుంటారని... భక్తుల కోరిక మేరకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.