ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రచారంలో వెనుకబడ్డ హస్తం... పత్తాలేని తారలు - తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచారంలో వెనుక బడింది. స్టార్‌ క్యాంపెయినర్లు పత్తా లేకుండా పోయారు. ఉన్న వాళ్లు వారి నియోజక వర్గాలకే  పరిమితమయ్యారు. రాహుల్‌ , విజయశాంతి తప్ప మరెవరూ ప్రచారానికి రాకపోవడం వల్ల అభ్యర్ధులు వ్యక్తిగత బలంతోనే ముందుకు వెళ్తున్నారు.

ప్రచారంలో వెనుకబడ్డ హస్తం
author img

By

Published : Apr 6, 2019, 6:22 AM IST

Updated : Apr 6, 2019, 7:26 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని... భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుక బడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపట్టిన తెరాస సైతం మొత్తం 17 స్థానాల్లో 16 గెలుస్తామన్న విశ్వాసంతో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తోంది. పక్కా ప్రణాళికతో అటు కేసీఆర్‌, ఇటు కేటీఆర్‌లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఆ 40 మంది ఎక్కడ..

విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు వీలుగా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు భారీగా ఉన్నారు. వారంతా తమ అభ్యర్ధుల గెలుపునకు ప్రచారం నిర్వహించాల్సి ఉంది... కానీ ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించలేదు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నా.. ప్రచారంలో జోరు కనిపించడం లేదు. జాతీయ నాయకులు ఎవరూ రాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, క్యాంపెయిన్‌ కమిటీ ఛైర్మన్‌ విజయశాంతిలు మాత్రమే ప్రచారంలో అరకొరగా పాల్గొంటున్నారు.

మరోసారి రాహుల్​

రాహుల్‌ ఈ నెల 8న రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మహబూబాబాద్‌, భువనగిరి లోక్​సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని... సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో రోడ్‌ షో నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ఒక్కరే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె కూడా మెదక్‌ పార్లమెంటు నియోజక వర్గానికే పరిమితమయ్యారు.

మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు మిగిలి ఉండడం వల్ల అభ్యర్ధులు బయట వ్యక్తులపై ఆశ పెట్టుకోకుండా తమకు వ్యక్తిగతంగా ఉన్న బలంతోనే ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు.

ప్రచారంలో వెనుకబడ్డ హస్తం

ఇవీ చూడండి: నేడు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు

Last Updated : Apr 6, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details