తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్​ - pcc

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్​ పార్టీ నేతలు నిర్ణయించారు. గాంధీ భవన్​లో కీలక నేతలతో జరిగిన సమావేశంలో  ఈ అంశంపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు.

congress-leaders-meeting

By

Published : May 11, 2019, 2:50 PM IST

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని హస్తం పార్టీ నేతలు నిర్ణయించారు. ఓటర్ల జాబితా సిద్ధం కాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్​ ఇవ్వడంపై సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేయనున్నారు. ఈ అంశంపై పార్టీ నేతలతో గాంధీ భవన్​ ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించారు. సమావేశంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కమిషన్​ వ్యవరిస్తున్నతీరు, ఇంతర అంశాలపై సమాలోచనలు చేశారు.

ఓటర్ల జాబితాలో స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు ఎలా..?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాలో స్పష్టత ఇవ్వలేదని నేతలు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన లేదన్నారు.

ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఆయా డీసీసీలకు అప్పగించామని ఉత్తమ్​ పేర్కొన్నారు. సమావేశంలో ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, వి.హనుమంతరావు, పొన్నాల, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్​ అలీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్​

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదావేయాలి: ఉత్తమ్​ లేఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details