రాష్ట్ర గవర్నర్ తమిళి సై సెక్షన్-8ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. గవర్నర్ నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆక్షేపించారు. పోలీసుల వ్యవహారశైలిపై లీగల్‌గా ముందుకెళ్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. ప్రభుత్వానికి గవర్నర్ ఎన్ని సార్లు లేఖలు రాసినా సమాధానం ఇవ్వడంలేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను కూడా డీజీపీ, సీఎంకు పలుమార్లు ఉత్తరాలు రాసినా స్పందించడం లేదన్నారు.
'గవర్నర్ సెక్షన్-8ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది' - Shabbir ali fire on cm kcr
గవర్నర్ నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వానికి గవర్నర్ ఎన్ని సార్లు లేఖలు రాసినా సమాధానం ఇవ్వడంలేదని ఆరోపించిన నేతలు... సెక్షన్-8 ఉపయోగించాలని కోరారు. ప్రజా సమస్యలను కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
!['గవర్నర్ సెక్షన్-8ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది' Congress leaders fire on trs government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:02-7601462-cong.jpg)
Congress leaders fire on trs government
కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు మాత్రమేనా అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సొంత జిల్లాకే నీళ్లు ఇవ్వని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నీళ్లేలా ఇస్తారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తాత్కాలికమేనన్న విషయం మర్చిపోవద్దన్న నేతలు... కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.