ఎన్నికల సమయంలో బైండోవర్ పేరుతో తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రచారంలో పాల్గొంటే రూ.లక్ష జరిమాన విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిరంజన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నాయకుల విగ్రహాలపై ముసుగులు వేస్తూ అవమానపరుస్తున్నారని నిరంజన్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అలాంటి నిబంధనలు ఏమీ లేవని తెలిపినట్లు పేర్కొన్నారు.
తమను ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు - all party meet
తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ప్రచారంలో పాల్గొంటే రూ.లక్ష జరిమాన విధిస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిపింది.
ఈసీకి ఫిర్యాదు
కౌంటింగ్ కేంద్రంలో లాప్‌ట్యాప్‌లతో అవకతవకలకు పాల్పడుతున్నారని తెదేపా నేత వనం రమేష్ అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు.
ఇవీ చూడండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
Last Updated : Mar 31, 2019, 7:41 AM IST