ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18, 19 తేదీల్లో రామగుండం, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈనెల 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటును పరిశీలిస్తారు. అదే రోజు ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం 19వ తేదీ ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహించి... ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కేసీఆర్ పనులను పరిశీలించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈనెల 18న రామగుండానికి కేసీఆర్... - కేసీఆర్ సమీక్ష
సీఎం కేసీఆర్ ఈ నెల 18న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రామగుండం ఎన్టీపీసీ, జెన్కో పవర్ ప్లాంట్ అధికారులతో విద్యుత్‌కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అనంతరం కాళేశ్వరంలో ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.
సీఎం కేసీఆర్